బాల్య వివాహాల నియంత్రణ అందరి బాధ్యత
ఆదిలాబాద్‌టౌన్: బాల్య వివాహల నియంత్రణ అందరి బాధ్యత అని డీసీపీవో రాజేంద్ర ప్రసాద్ అన్నారు. బాల్య వివాహల నిర్మూలనపై ఓ ఎన్జీవో ఆధ్వర్యంలో ఈనెల 17 నుంచి చేపట్టిన ప్రచార రథయాత్ర శనివారం బాలల సంరక్షణ కార్యాలయాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమ్మాయికి 18ఏళ్లు, అబ్బాయికి 21ఏళ్లు దాటిన తరువాతే వివాహం చేయాలన్నారు. ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నట్టు తెలిస్తే టోల్‌ఫ్రీ నంబర్లు 1098, 100కు కాల్ చేయాలని కోరారు. కార్యక్రమంలో పీవోఎన్‌ఎస్ వినోద్ కుమర్, పీవోఐసీ స్వామి, ఎన్టీవో కోఆర్డినేటర్ వినోద్, సూపర్‌వైజర్లు సంపత్, కిరణ్, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.


