‘కాంగ్రెస్ హయాంలో హిందువులపై దాడులు’
ఆదిలాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన తర్వాత హిందువులు, బీజేపీ నాయకులపై దాడులు పెరిగాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంప్ కార్యాలయంపై వందలాది మంది కాంగ్రెస్ గుండాలు సామూహికంగా దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని పేర్కొన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎంలు అపవిత్ర పొత్తు పెట్టుకుని పదవులను పంచుకున్నాయని విమర్శించారు. దీనిని ప్రశ్నించినందుకే దాడులకు పాల్పడినటట్లుగా ఆరోపించారు. ఈ అరాచక ఘటనలపై రాష్ట్రపతికి, గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో నాయకులు వేద వ్యాస్, కృష్ణ యాదవ్, సతీష్, తదితరులున్నారు.


