సీఎం కప్‌లో మనోళ్ల సత్తా
ఆదిలాబాద్: సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఏకంగా ఎనిమిది పతకాలు కై వసం చేసుకుని సత్తా చా టారు. హన్మకొండలోని జేఎన్ స్టేడియంలో నిర్వహిస్తున్న పోటీల్లో భాగంగా శనివారం కిడ్స్ విభాగంలో జావెలిన్ త్రోలో కే.జకేష్, ఎం.హనుమంతు స్వర్ణ పతకాలతో మెరిశారు. 60 మీటర్ల పరుగులో ఎం.ఇంద్రభాన్ స్వర్ణం సాధించాడు. అలాగే హెచ్‌కె.నగేశ్ 600 మీటర్ల పరుగులో, డి.యువరాజు 80 మీటర్స్ హాడిల్స్‌లో రజత పతక విజేతలుగా నిలిచారు. 1500 మీటర్ల పరుగులో ఎం.శ్రీలత, 80 మీటర్ల హాడిల్‌లో పి. స్వాతి, షాట్ పుట్ విభాగంలో ఇంద్రుసావ్ కాంస్య పతకాలు కై వసం చేసుకున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్, కోచ్ రమేశ్ తెలిపారు. విజేతలను డీవైఎస్‌వో జక్కుల శ్రీనివాస్, టీటీఎస్‌వో పార్థసారథి, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్‌రెడ్డి తదితరులు అభినందించారు.


