పట్టణాభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

పట్టణాభివృద్ధికి కృషి

Feb 22 2026 7:24 AM | Updated on Feb 22 2026 7:24 AM

పట్టణాభివృద్ధికి కృషి

పట్టణాభివృద్ధికి కృషి

● ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను.. ● మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బండారి అనూష ● అట్టహాసంగా బాధ్యతలు స్వీకరణ

కైలాస్‌నగర్‌: ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని వ మ్ముచేయకుండా పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలిపేలా కృషి చేస్తానని మున్సి పల్‌ చైర్‌పర్సన్‌ బండారి అనూష అన్నారు. మున్సి పల్‌ కార్యాలయంలోని చాంబర్‌లో శనివారం అట్టహాసంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పట్టణంలోని అన్ని వార్డులను తన వార్డుగానే భావిస్తూ అభివృద్ధి చేస్తానని అన్నారు. ఆయా కాలనీల్లో నెలకొన్న సమస్యలు తెలుసుకునేందుకు త్వరలోనే వార్డు విజిట్‌ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. సత్వరం పరిష్కరించే వాటిని అక్కడికక్కడే పూర్తి చేసేలా చర్యలు చేపడతామన్నారు. ఆర్థికపరమైన సమస్యలుంటే కౌన్సిల్‌లో చర్చించి సభ్యుల ఆమోదం మేరకు ప్రాధాన్య క్రమంలో పూర్తి చేసేలా చూస్తానని తెలిపారు.

అభినందనల వెల్లువ

చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన అనూషకు అభినందనలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి, వైస్‌ చైర్మన్‌ మహ్మద్‌ రోహిత్‌, అలాగే పార్టీ నాయకులు అడ్డి భో జారెడ్డి, బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, గండ్రత్‌ సుజాత, మున్సిపల్‌ కమిషనర్‌ జి.రాజు, మెప్మా పీడీ సీవీఎన్‌ రాజు, మున్నూరుకాపు సంఘ బాధ్యులు, ఉద్యోగులు, వార్డు ఆఫీసర్లు, సిబ్బంది, పలువురు కౌన్సి లర్లు , మాజీ కౌన్సిలర్లు ఆమెను శాలువాలు, పూలమాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement