● నూతన కార్యక్రమానికి పోలీస్‌శాఖ శ్రీకారం ● రోడ్డు ప్రమ
ఆదిలాబాద్‌టౌన్: పోలీసు శాఖ మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, సోషల్ మీడియా తదితర మోసాల బారిన పడకుండా విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ‘ఖాకీ కిడ్స్’ పేరి ట ప్రత్యేక కార్యక్రమాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం ప్రారంభించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేకంగా వారియర్లను నియమించారు. విద్యార్థులను చైతన్యపరిచేలా కార్యాచరణను రూపొందించారు.
పోలీస్ స్టేషన్‌కు ఒక వారియర్..
ఖాకి కిడ్స్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చే సేందుకు ఎస్పీ చర్యలు చేపడుతున్నారు. ఇందుకో సం జిల్లాలోని 19 స్టేషన్ల పరిధిలో సైబర్ వారియర్స్‌ను నియమించారు. ఒక్కో స్టేషన్‌కు ఒక్కో పోలీస్‌ను ప్రత్యేకంగా కేటాయించారు. వీరు తమ రెగ్యులర్ విధులతో పాటు వారానికి తమ పరిధిలోని మూడు పాఠశాలలు, కళాశాలలను సందర్శించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ వారియర్స్ రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్ట్, ఓటీపీ ఫ్రాడ్, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్, జాబ్‌వర్క్, లోన్‌ఫ్రాడ్, క్రెడిట్ మో సాలు, ఫేక్ వెబ్‌సైట్, ఏపీకే ఫైల్స్ వంటి సోషల్ మీడి యా పరంగా జరిగే మోసాలను తెలియజేస్తారు. మైన ర్లు వాహనాలు నడిపితే జరిగే నష్టాలపై అవగాహన కల్పిస్తా రు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల వల్ల పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు పడుతున్న ఆవేదనను వారికి తెలియజేసి తద్వారా వారిని చైతన్యపరుస్తారు. సైబర్ నేరాల బారిన పడిన వెంటనే గోల్డెన్ అవర్‌లో 1930 నంబర్‌కు ఫిర్యాదు చేసేలా అవగాహన కల్పిస్తారు. అవగాహన పొందిన ప్రతీ విద్యార్థికి పోలీస్‌శాఖ తరఫున ప్రత్యేక బ్యాడ్జిని సైతం అందజేస్తారు.
విద్యార్థి దశ నుంచే..
నేటి బాలలే రేపటి పౌరులు అనే నానుడి నేపథ్యంలో ఇప్పటి నుంచే వారికి అవగాహన కల్పించడం ద్వారా భవిష్యత్తులో చెడుమార్గాల్లో వెళ్లకుండా జాగ్రత్త పడవచ్చు. ఈ మేరకు రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, సోషల్ మీడియాతో తలెత్తే అనా ర్థాల గురించి పోలీసులు వారికి అవగాహన కల్పిస్తున్నారు. తల్లిదండ్రులకు సైతం తెలియజేసేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. ద్విచక్ర వాహనంపై తల్లిదండ్రులతో వెళ్లినప్పుడు హెల్మెట్ ధరింపజేయడం, కారులో వెళ్లినప్పుడు సీట్ బెల్టు పెట్టుకోవడం, అతివేగంతో జరిగే ప్రమాదాలతో జరిగే ప్రాణనష్టంపై తెలియజేయడం, ఇటీవల జరిగే సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వీరికి వివరించనున్నారు. విద్యార్థులకు అవగాహన కల్పించడం ద్వారా వారు వాటికి దూరంగా ఉండటంతో పాటు వారి కుటుంబీకులకు అవగాహన కల్పించనున్నారు.


