ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత
● ఎస్పీ అఖిల్ మహాజన్
తలమడుగు: ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని ఎస్పీ అఖిల్ మహా జన్ అన్నారు. మండలంలోని బరంపూర్ సమీ పంలో కొండపై కొలువైన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం స్వామి వారి కల్యాణ మహోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఎస్పీ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. కార్యక్రమంలో డీఎస్పీ జీవన్‌రెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు కేదారేశ్వర్‌రెడ్డి, లోక భూమారెడ్డి, దామోదర్ రెడ్డి, తాంసి ఎస్సై జీవన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


