కనికుట్టు | - | Sakshi
Sakshi News home page

కనికుట్టు

Feb 9 2026 8:11 AM | Updated on Feb 9 2026 8:11 AM

కనికు

కనికుట్టు

ప్రత్తిపాడు: మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఇస్తాం.. సర్టిఫికెట్లతో పాటు కుట్టు మెషీన్లు ఉచితంగా అందిస్తాం.. స్వయం ఉపాధి కల్పిస్తాం.. లక్షాధికారుల్ని చేస్తాం.. అంటూ గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం పెద్ద హడావుడే చేసింది. తీరా చూస్తే శిక్షణ పూర్తయి నెలలు గడుస్తున్నా ఉచితంగా ఇస్తామన్న కుట్టు మెషీన్ల ఊసే తేవడం లేదు. వాటి కోసం ఎంపీడీఓ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న మహిళలు.. ఇది చంద్రబాబు మార్కు కనికట్టులా ఉందని విమర్శిస్తున్నారు. కూలీనాలీ చేసుకుంటూ జీవిస్తున్న తాము ప్రభుత్వ పెద్దల మాటలు నమ్మి.. చేస్తున్న పనులు మానుకుని ఉచిత కుట్టు శిక్షణ పొందితే మెషీన్లు ఎందుకివ్వడం లేదంటూ శాపనార్థాలు పెడుతున్నారు.

శిక్షణ ఇచ్చారిలా..

మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చేందుకు జిల్లావ్యాప్తంగా 60 కేంద్రాలు ఏర్పాటు చేయాలని తొలుత భావించారు. చివరకు వాటిని 50కి పరిమితం చేశారు. సెంటర్‌ ఫర్‌ అర్బన్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (సీయూఆర్‌డీ), సోషల్‌ ఏజెన్సీ ఫర్‌ పీపుల్స్‌ ఎంపవర్‌మెంట్‌ (ఎస్‌ఏపీఈ) సంస్థల ఆధ్వర్యాన ఈ శిక్షణ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. శిక్షణ ఇచ్చేందుకు ప్రతి కేంద్రంలోనూ ఒక ట్రైనర్‌, ఒక కంప్యూటర్‌ ఆపరేటర్‌ను నియమించారు. శిక్షణ, కేంద్రం అద్దె, కుట్టు మెషీన్‌, ఇతర పరికరాలు కలిపి ఒక్కో మహిళకు సుమారు రూ.22 వేల చొప్పున కేటాయించారు. ఈ శిక్షణకు జిల్లావ్యాప్తంగా 27,722 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో వివిధ కార్పొరేషన్ల ద్వారా 6,568 మందిని ఎంపిక చేయగా చివరకు 4,920 మంది మాత్రమే శిక్షణకు హాజరయ్యారు. వీరికి గత ఏడాది జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో 90 రోజుల పాటు ఆయా కేంద్రాల్లో రెండు బ్యాచ్‌లుగా శిక్షణ తరగతులు నిర్వహించారు. శిక్షణ పూర్తయిన వెంటనే 75 శాతం హాజరు నమోదైన మహిళలకు సర్టిఫికెట్‌తో పాటు ఉచితంగా కుట్టు మెషీన్‌ అందజేయనున్నట్లు ప్రభుత్వం నమ్మబలికింది. అయితే, శిక్షణ పూర్తయి మూడు నెలలు గడిచినా, ఇప్పటి వరకూ సర్టిఫికెట్లు, కుట్టు మెషీన్లు మాత్రం ఇవ్వలేదు. దీంతో, శిక్షణ పొందిన మహిళలు ఆయా ఎంపీడీఓ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కుట్టు శిక్షణ తీసుకుంటే ఉపాధి లభిస్తుందనే ఆశతో ఇతర కూలి పనులు మానుకుని మరీ ఆయా కేంద్రాలకు రోజూ క్రమం తప్పకుండా వెళ్లి శిక్షణ పొందామని చెబుతున్నారు. ఇప్పటికై నా చెప్పిన విధంగా సర్టిఫికెట్లు, కుట్టు మెషీన్లు ఇవ్వాలని మహిళలు కోరుతున్నారు.

ఉన్నతాధికారుల దృష్టికి

తీసుకెళ్తున్నాం

శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కుట్టు మెషీన్లు అందించాలని మాపై ఒత్తిడి వస్తోంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలందరికీ త్వరలోనే కుట్టు మెషీన్లు అందుతాయి. దీనిపై ఆందోళన అవసరం లేదు.

– ఎ.శ్రీనివాసరావు, ఈడీ, బీసీ కార్పొరేషన్‌, కాకినాడ

ఫ ఉచిత కుట్టు శిక్షణ పేరిట

సర్కార్‌ ఆర్భాటం

ఫ సర్టిఫికెట్‌, కుట్టు మెషీన్‌ ఇస్తామని హడావుడి

ఫ జిల్లాలో 27,722 మంది దరఖాస్తు

ఫ 4,920 మందికే ట్రైనింగ్‌

ఫ శిక్షణ పూర్తయి మూడు నెలలు

ఫ ఇప్పటికీ అందని కుట్టు మెషీన్లు

ఫ ఎంపీడీఓ కార్యాలయాల చుట్టూ మహిళల ప్రదక్షిణలు

వివిధ కార్పొరేషన్ల ద్వారా జిల్లాలో ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చారిలా..

కార్పొరేషన్‌ మొత్తం నమోదైన ఎంపికై న శిక్షణకు

యూనిట్లు మహిళలు వారు హాజరైన వారు

బీసీ 1,984 15,131 3,506 2,496

ఈబీసీ 124 175 45 39

కమ్మ 239 177 55 34

రెడ్డి 227 157 72 46

ఆర్యవైశ్య 133 273 89 65

క్షత్రియ 105 65 12 6

బ్రాహ్మణ 174 85 31 23

కాపు 803 11,659 2,758 2,211

మొత్తం 3,789 27,722 6,568 4,920

కనికుట్టు1
1/2

కనికుట్టు

కనికుట్టు2
2/2

కనికుట్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement