లీకేజీలే.. సమస్య
మున్సి ‘పల్స్’
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ పట్టణంలో ప్రస్తుతం తాగునీటి ఇబ్బంది అంతగా లేనప్పటికీ లీకేజీలే ప్రధాన సమస్య. పైపులైన్లు, వాల్వ్‌ల వద్ద నిత్యం ఎక్కడో ఓ చోట లీకేజీలు ఏర్పడుతున్నాయి. సకాలంలో గుర్తించి మరమ్మతులు చేపట్టకపోవడంతో వేలాది లీటర్ల తాగునీరు వృథాగా పోతుంది. అలాగే నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇక ఇళ్లలో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ నల్లాలకు ఆనాఫ్ బిరడాలు లేకపోవడంతోనూ నీరు వృథా అవుతుంది. పట్టణంలోని గాంధీనగర్, ఇందిరమ్మ కాలనీలోని కొంత భాగాలకు ఇప్పటికీ మిషన్ భగీరథ పైపులైన్లు పూర్తిస్థాయిలో చేరలేదు. విలీనమైన ఎంప్లాయీస్‌కాలనీ, తిరుమలనగర్, కృష్ణానగర్, అటెండెర్స్ కాలనీల్లో అసలు పైపులైన్లే వేయలేదు. దీంతో ఆయా వార్డుల్లోని ప్రజలు బోర్‌వెల్స్, చేతిపంపులపైనే ఆధారపడాల్సిన దుస్థితి. పట్టణంలో శాశ్వత నీటి సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం అమృత్–2.0లో భాగంగా రూ.200 కోట్లు మంజూరు చేసినా ఆ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో వచ్చే వేసవిలోనూ ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. మౌలిక వసతుల్లో కీలకమైన తాగునీటి సరఫరాలో తలెత్తే ఇబ్బందులు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల తలరాతను మార్చనున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పట్టణంలో తాగునీటి సరఫరా వివరాలు
మొత్తం పైపులైన్ : 424 (కిలోమీటర్లు)
రిజర్వాయర్లు : 11
నిల్వ సంపు : 01
ప్రతిరోజు నీటి సరఫరా జరిగే వార్డులు : 25
రోజు విడిచిరోజు నీటి సరఫరా
జరిగే వార్డులు : 24
ఏడాదిగా నత్తనడకన సాగుతున్న అమృత్ రిజర్వాయర్ నిర్మాణ పనులు
లీకేజీలే.. సమస్య


