28 నుంచి క్రీడా సంబరాలు | - | Sakshi
Sakshi News home page

28 నుంచి క్రీడా సంబరాలు

Jan 27 2026 7:54 AM | Updated on Jan 27 2026 7:54 AM

28 ను

28 నుంచి క్రీడా సంబరాలు

కై లాస్‌నగర్‌: బోథ్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఈనెల 28 నుంచి 30 వరకు ప్రేరణ పేరిట నిర్వహించనున్న జిల్లా స్థాయి క్రీడా సాంస్కృతిక సంబరాల పోస్టర్‌, లోగోను జిల్లా జడ్జి కె.ప్రభాకరరావు, కలెక్టర్‌ రాజర్షిషా సోమవారం ఆవిష్కరించారు. పరేడ్‌ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా, సృజనాత్మక శక్తి వెలికితీసేందుకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఈ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ఏడుగురు పోలీసులకు ‘అతిఉత్కృష్ట’ పతకాలు

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లా పో లీ సు శాఖలో పనిచేస్తున్న ఏ డుగురు పోలీసులకు రాష్ట్ర పోలీ సు శాఖ అతిఉత్కృష్ట సేవా ప తకాలు ప్రకటించింది. 2025 సంవత్సరంలో వారు అందించిన సేవలకు గాను ఈ పురస్కారాలు వరించాయి. జిల్లా కేంద్రంలోని పరేడ్‌ మై దానంలో సోమవారం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో సదరు పోలీసులకు జిల్లా జడ్జి ప్ర భాకరరావు, కలెక్టర్‌ రాజర్షిషా, ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ చే తుల మీదుగా పతకాలు అందజేశారు. సేవా ప తకం అందుకున్న వారిలో ఆర్‌.ధారాసింగ్‌, గంగాసింగ్‌, సంజీవ్‌ కుమార్‌, సుధాకర్‌ రెడ్డి, జె. అర్జున్‌,శివాజీ, బి.శివన్న ఉన్నారు.

సేంద్రియ ఉత్పత్తులను ఆదరించాలి

కై లాస్‌నగర్‌: సేంద్రియ విధానంలో సాగయ్యే ఉత్పత్తులను ప్రజలు ఆదరించాలని కలెక్టర్‌ రా జర్షిషా అన్నారు. పట్టణంలోని కలెక్టర్‌చౌక్‌లో గల నేచరల్స్‌ కేంద్రంలో ఏర్పాటు చేసిన చెరు కు రసం మిషన్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్‌ స్వామి, నిర్వాహకులు, రైతులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీల ధర్నాకు మద్దతు

ఆదిలాబాద్‌టౌన్‌: హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ వద్ద మంగళవారం చేపట్టనున్న ఎమ్మెల్సీల ధర్నాకు మద్దతు తెలుపుతున్నట్లు టీపీయూఎస్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సునిల్‌ కుమార్‌, వలభోజు గోపీకృష్ణ ప్రకటనలో తెలిపారు.విశ్రాంత ఉపాధ్యాయుల, ఉద్యో గుల పెండింగ్‌ బిల్లులు, పీఆర్సీ అమలు కోసం ఎమ్మెల్సీలు ఏవీఎన్‌ రెడ్డి, మల్కా కొముర య్య, అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

28 నుంచి క్రీడా సంబరాలు 1
1/7

28 నుంచి క్రీడా సంబరాలు

28 నుంచి క్రీడా సంబరాలు 2
2/7

28 నుంచి క్రీడా సంబరాలు

28 నుంచి క్రీడా సంబరాలు 3
3/7

28 నుంచి క్రీడా సంబరాలు

28 నుంచి క్రీడా సంబరాలు 4
4/7

28 నుంచి క్రీడా సంబరాలు

28 నుంచి క్రీడా సంబరాలు 5
5/7

28 నుంచి క్రీడా సంబరాలు

28 నుంచి క్రీడా సంబరాలు 6
6/7

28 నుంచి క్రీడా సంబరాలు

28 నుంచి క్రీడా సంబరాలు 7
7/7

28 నుంచి క్రీడా సంబరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement