వేతన వెతలు తీరేలా.. | - | Sakshi
Sakshi News home page

వేతన వెతలు తీరేలా..

Jan 26 2026 4:40 AM | Updated on Jan 26 2026 4:40 AM

వేతన వెతలు తీరేలా..

వేతన వెతలు తీరేలా..

కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌పై ప్రభుత్వం ఫోకస్‌ అక్రమాలకు చెక్‌ పెట్టేలా చర్యలు ఐఎఫ్‌ఎంఎస్‌ పోర్టల్‌లోకి ఉద్యోగుల వివరాలు ఏప్రిల్‌ నుంచి వారి అకౌంట్లలోకే వేతనాలు?

సాక్షి,ఆదిలాబాద్‌: కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి ఇక వేతన ఇక్కట్లు తొలగిపోనున్నట్ల తెలుస్తోంది. ఏప్రిల్‌ నుంచి వారి బ్యాంకు ఖాతాలకే నేరుగా వేతనాలు జమ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రెగ్యులర్‌ ఉద్యోగుల వివరాలు ఉండే ఇంటిగ్రేడేట్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం(ఐఎంఎఫ్‌ఎస్‌) పోర్టల్‌లో వీరి వివరాల నమోదు ప్రక్రియ ఇటీవల చేపట్టింది. ఒకవేళ ఇది అమలైతే కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ శాఖల్లో హెచ్‌వోడీలు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సంబంధించి ఆ ఏజెన్సీలు పాల్పడుతున్న అక్రమాలకు చెక్‌ పడనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఐఎఫ్‌ఎంఎస్‌ పోర్టల్‌లో నమోదు..

కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఆయా శా ఖల హెచ్‌వోడీలు, ఏజెన్సీలు అందించే వేతనాల్లో కోత విధిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అంతే కా కుండా వేతనాలు సైతం మూడు నుంచి ఆరు నెలల వరకు పెండింగ్‌లో పెట్టడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆయా ఉద్యోగులు ఏళ్లుగా పోరా టం చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో వారు చేపట్టిన ఆందోళనలతో ప్రభుత్వం ఈ వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దే దిశగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వారి పూర్తి వివరాలను ఇటీవల ఐఎఫ్‌ఎంఎస్‌ పోర్టల్‌లో నమోదు చేసింది. తద్వారా ఈ ఉద్యోగులకు డైరెక్ట్‌గా వారి అకౌంట్‌లో ప్రతి నెల జీతం జమ చేసేలా చర్యలు చేపడుతున్నట్లుగా తెలుస్తోంది.

వెలుగులోకి పలు అక్రమాలు..

ప్రధానంగా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సంబంధించి ఆయా ఏజెన్సీలు ప్రతినెలా వారికి చెల్లించాల్సిన వేతనాల్లో భారీగా కోత పెట్టి ఇస్తున్నారనే ఆరోపణ లు ముందు నుంచి ఉన్నాయి. అంతే కాకుండా వారి కి సంబంధించి పీఎఫ్‌, ఈఎస్‌ఐ చెల్లించకపోవడంతో భద్రత లేకుండా పోతుందని ఆ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు ఏజెన్సీలు జీఎస్టీ కూ డా చెల్లించకుండా ప్రభుత్వ ఆదాయానికి గండీ కొడుతున్నాయనే విమర్శలు లేకపోలేదు. ఇటీవల ఐఎఫ్‌ఎంఎస్‌లో వివరాలు నమోదు చేసినప్పుడు ఔట్‌సోర్సింగ్‌ ప్రక్రియలో ఒకే వ్యక్తి పలు పోస్టుల్లో ఉన్నట్టుగా రాష్ట్ర పరిధిలో తేలింది. జిల్లాలోనూ ఓ వ్యక్తి నాలుగు పోస్టుల్లో చెలామణి అయినట్లు వెల్ల డెంది. ఐఎఫ్‌ఎంఎస్‌లో ఆధార్‌, ఫోన్‌నంబర్‌, బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలను నమోదు చేయడంతో ఇ లాంటివి వెలుగులోకి వచ్చాయి. అసలు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న వారు ఎవరు, ప్ర స్తుతం పనిచేస్తున్నాడా.. లేదా.. తొలగించిన పక్షంలో ఆ వివరాలు ప్రభుత్వ శాఖలకు అందజేస్తున్నారా.. మళ్లీ ఆ పోస్టులో అనుమతి తీసుకొనే వేరొకరిని నియమిస్తున్నారా.. ఇలాంటి అనేక అక్రమాలు ఈ ప్రక్రియలో ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. ఒక ఉద్యోగి వెళ్లిపోతే ఆ స్థానంలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే అక్రమ పద్ధతుల్లో వేరొకరిని నియమించడం వంటివి ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలలో నిత్యం జరిగే తంతు. దీంతోనే ప్రభుత్వం ఈ వ్యవస్థలో పూర్తిగా మార్పులు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.

జిల్లాలోని ఉద్యోగుల వివరాలు..

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు సుమారు 2,000

కాంట్రాక్ట్‌ ఉద్యోగులు సుమారు 1000

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement