ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం
కై లాస్‌నగర్: ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం వంటిదని, దానిని తప్పనిసరిగా వినియోగించుకో వాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. తొలుత ఎన్‌సీసీ కేడెట్స్, విద్యార్థులతో స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి జెడ్పీ సమావేశ మందిరం వరకు ఓటరు చైతన్య ర్యాలీ చేపట్టారు. కలెక్టర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం జెడ్పీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రలోభాలకు గురై ఓటు వేస్తే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే నైతిక హక్కును కోల్పోతారన్నారు. అనంతరం సీనియర్, నూతన ఓటర్లను శాలువాలతో సత్కరించారు. ఫొటోలతో కూడిన ఎపిక్ కార్డులు అందజేశారు. అలాగే పలువురు అధికారులకు ప్ర శంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో స్రవంతి, డీఎస్పీ జీవన్‌రెడ్డి, డీఐఈవో జాదవ్ గణేశ్ పాల్గొన్నారు.
ఓటు హక్కు వినియోగించుకోవాలి
ఉట్నూర్‌రూరల్: ప్రతి ఒక్కరూ ఓటు హక్కు విని యోగించుకోవాలని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా మండలకేంద్రంలోని కుమురంభీం కాంప్లెక్స్ నుంచి పాత బస్టాండ్ వరకు అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్ర జాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించారు. ఇందులో తహసీల్దార్ ప్రవీణ్, సీఐ ప్రసాద్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.


