బీఆర్‌ఎస్‌కు మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ రాజీనామా
● ఏఐఎఫ్‌బీలో చేరిన రంగినేని మనిషా
ఆదిలాబాద్‌టౌన్: బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసినట్లు మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ రంగినేని మనిషా పవన్‌రావ్ తెలిపారు. పట్టణంలోని ప్రింట్ మీడియా ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌లో గౌరవం లేని కారణంగా ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్‌బీ)లో చేరినట్లు తెలిపారు. గత మున్సిపల్ ఎన్నికల్లో తనతో పాటు తన కుటుంబ సభ్యులు స్వార్థ రాజకీయాలకు బలైనట్లు పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఆఖరి నిమిషం వరకు మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఇస్తామని నమ్మించి అవమానపర్చినప్పటికీ పార్టీలో కొనసాగినట్లు పేర్కొన్నారు. తా ను 2014 నుంచి 2019 వరకు మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పనిచేశానని, పదవీ కాలంలో పార్టీ పెద్దలు కూడా అనేక ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ త రఫున మళ్లీ పోటీ చేయనున్నట్లు పేర్కొన్నారు.


