‘బీజేపీతోనే పట్టణాభివృద్ధి’
ఆదిలాబాద్: బీజేపీతోనే పట్టణ అభివృద్ధి సా ధ్యమని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ, శ్రీనగర్ కాలనీ, వివేకానంద కాలనీ, అగ్రజా టౌన్‌షిప్‌లలో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికుల సమస్యలు అడిగి తెలు సుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడు తూ, రాజకీయాలకతీతంగా ఆదిలాబాద్ అభివృద్ధికి పాటుపడతానని అన్నారు. జిల్లా కేంద్రంలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కోసం అన్నివిధాలుగా కృషి చేస్తున్నామన్నారు. పట్టణ పరిధి లో ఇప్పటికే కోట్ల నిధులతో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయ ని తెలిపారు. మున్సిపాలిటీలో బీజేపీ విజ యం సాధిస్తే మరిన్ని ప్రగతి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ఆయన వెంట నాయకులు స్వామిరెడ్డి, తిరుమలేష్, అడెల్లు, కాళి దాస్, సాయి, గోపి తదితరులున్నారు.


