ఎండీఎం కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ఆదిలాబాద్‌టౌన్: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే కార్మికులకు పీఎఫ్, ఈఎస్‌ఐతో పాటు పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. త్వరలో నిర్వహించే మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రాములు, అనిత, సునిత, రుకుంబాయి, రాంబాయి తదితరులు పాల్గొన్నారు.


