● మున్సిపల్‌లో నిర్వహణ అస్తవ్యస్తం ● పలుకాలనీల్లో కనిపి
కై లాస్‌నగర్: ప్రజలు ఆరోగ్యంగా జీవించాలంటే పారిశుద్ధ్య నిర్వహణ ఎంతో కీలకం. గ్రేడ్–1 స్థాయి కలిగిన ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఇది గాడి తప్పుతోంది. విలీన కాలనీలతో పాటు పలు పాత వార్డుల్లోనూ డ్రెయినేజీల నిర్మాణం జరుగకపోవడంతో మురుగునీరంతా రోడ్లపై ప్రవహిస్తోంది. దీంతో ఆయా కాలనీల్లో దుర్గంధం వెదజల్లుతోంది. ప్రధానంగా వర్షాకాలంలో దోమల బెడద అధికమై ప్రజలు రోగాల బారిన పడాల్సి వస్తోంది. పారిశుద్ధ్య కార్మికులుగా నియామకమైన పలువురిని శుభ్రత పనుల్లో కాకుండా ఇతర చోట్ల నియమించారు. దీంతో క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత ఏర్పడి ఆయా పనులపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డ్రెయినేజీల్లోని పూడిక తొలగింపు సకాలంలో జరగకపోగా, ఇంటింటి చెత్త సేకరణ సైతం సక్రమంగా చేపట్టడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెగ్యులర్‌గా చెత్తబండ్లు రాకపోవడం, అధికారుల పర్యవేక్షణ లోపంతో పలు కాలనీల్లో అనధికార చెత్తడంపులు దర్శనమిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం కింద కోట్లాది రూపాయలను అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ కోసం మంజూరు చేయగా ఆ పనుల జాడ లేకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. త్వరలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల్లో పారిశుద్ధ్య నిర్వహణ అంశం సైతం ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది.
మున్సి ‘పల్స్’
● మున్సిపల్‌లో నిర్వహణ అస్తవ్యస్తం ● పలుకాలనీల్లో కనిపి
● మున్సిపల్‌లో నిర్వహణ అస్తవ్యస్తం ● పలుకాలనీల్లో కనిపి


