జిల్లా జైలు సూపరింటెండెంట్‌గా గోపిరెడ్డి బాధ్యతలు
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా జైలు సూపరింటెండెంట్ అశోక్‌కుమార్ నిజామాబాద్‌కు బదిలీ అ య్యారు. ఆయన స్థానంలో వరంగల్ జిల్లా జైలర్‌గా పని చేస్తున్న పందిరి గోపిరెడ్డిని ఆదిలాబాద్‌కు ని యమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన శనివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. బదిలీ అయిన, విధుల్లో చేరి న అధికారులను జైలు ఉద్యోగులు, సిబ్బంది సత్కరించారు. కాగా నాలుగున్నరేళ్ల పాటు ఇ క్కడ పనిచేసిన అశోక్‌కుమార్ జిల్లా జైలులో అ నేక సంస్కరణలు అమలు చేసి తనదైన ముద్ర వేసుకున్నారు. ఖైదీల ఆదాయం పెంపుతో పా టు వారిలో సత్ప్రవర్తన అలవర్చుకునేలా ప్ర త్యేక శ్రద్ధ వహించారు. విద్యు త్ ఆదా చేసేలా ప్రత్యేకంగా సోలార్ ప్యానెల్ ప్రాజెక్ట్, వాహనాల వాషింగ్ యూనిట్, పెట్రోల్ బంక్ వంటివి ఏర్పాటు చేయించారు. ఇలా అనేక కార్యక్రమాలను అమలు చేసి ఉన్నతాధికారుల మన్ననలు పొందారు.


