రిమ్స్‌లో ‘ఎన్‌ఎంసీ’ తనిఖీలు
ఆదిలాబాద్‌టౌన్: రిమ్స్ మెడికల్ కళాశాలలో నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్‌ఎంసీ) బృందం సభ్యులు శనివారం తనిఖీలు చేపట్టారు. కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లు 120 నుంచి 150కి పెంచాలని రిమ్స్ అధికారులు ఇటీవల దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో కౌన్సిల్ సభ్యులు నాగమోహన్, చంద్రశేఖర్ తనిఖీలు నిర్వహించారు. ల్యాబ్‌తో పాటు ఆయా వార్డులు, బ్లడ్ బ్యాంక్, సీటీ, ఎంఆర్‌ఐ స్కానింగ్ విభాగాలు, ఎస్‌ఎన్‌సీయూ, లేబర్ రూం, ఓపీ, ఐపీ విభా గాలను పరిశీలించారు. అనంతరం రిమ్స్‌లో పనిచేస్తున్న వైద్యుల హాజరుపై ఆరా తీశారు. వీరి వెంట రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డిప్యూటీ సూపరింటెండెంట్లు దీపక్, నరేందర్ బండారి, ఎన్‌ఎంసీ నోడల్ అధికారి ప్రశాంత్‌రెడ్డి, కళాశాల వైస్ ప్రిన్సిపాళ్లు విద్యా విల్సన్, సరోజ, అసిస్టెంట్ డైరెక్టర్లు సిరాజ్ అలీ, వేణుగోపాల్ రెడ్డి తదితరులున్నారు.


