అంతర్గతం.. అధ్వానం
మున్సి ‘పల్స్’
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపాలిటీ గ్రేడ్–1 స్థాయికి ఎదిగినా వసతుల పరంగా ఇంకా వెనుకబడే ఉంది. పాలకులు మారుతున్నారే తప్ప వార్డుల్లో సౌకర్యాలు మాత్రం ఇప్పటికీ అంతంతే. రహదారుల విషయానికి వస్తే ప్రధాన రోడ్లను బీటీ, సీసీగా మార్చినప్పటికీ అంతర్గత రోడ్ల పరిస్థితి అధ్వానంగానే ఉంది. పట్టణంలోని పలు కాలనీల్లో పూర్తిస్థాయిలో రోడ్ల నిర్మాణాలు జరగలేదు. ఆర్‌ఆర్ నగర్, కృష్ణానగర్, గాంధీనగర్, రణదీవేనగర్, భగత్‌సింగ్‌నగర్‌తో పాటు విలీన కాలనీలైన అటెండర్స్‌కాలనీ, తిరుమలనగర్, ఎంప్లాయీస్ కాలనీ, టైలర్స్‌కాలనీ, గ్రీన్‌సిటీ, సంజయ్‌నగర్, న్యూ హౌసింగ్‌బోర్డు వంటి అనేక కాలనీల్లో ఇప్పటికీ మట్టి రోడ్లే దర్శనమిస్తున్నాయి. ఎత్తు, పల్లాలతో కూడిన దారిపై స్థానికులకు తిప్పలు తప్పడం లేదు. త్వరలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బరిలో నిలిచే అభ్యర్థులకు ఈ అంశం సవాలుగా మారనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మున్సిపల్ పరిధిలో రహదారుల విస్తీర్ణం (కిలోమీటర్లలో)
పట్టణంలో మొత్తం రోడ్లు 546.77
బీటీ 43.52
సీసీ 313.80
గ్రావెల్ 189.45
అంతర్గతం.. అధ్వానం


