బల్దియాపై కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలి | - | Sakshi
Sakshi News home page

బల్దియాపై కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలి

Jan 25 2026 7:10 AM | Updated on Jan 25 2026 7:10 AM

బల్దియాపై కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలి

బల్దియాపై కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలి

● పార్టీ ఎన్నికల ఇన్‌చార్జి పి.సుదర్శన్‌రెడ్డి

కైలాస్‌నగర్‌: రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో ఆదిలా బాద్‌ మున్సిపాలిటీపై కాంగ్రెస్‌ జెండా ఎగురవేసే లా పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని పార్టీ పా ర్లమెంట్‌ ఇన్‌చార్జి, బోధన్‌ ఎమ్మెల్యే పి.సుదర్శన్‌రెడ్డి సూచించారు. పట్టణంలోని ప్రజాసేవాభవన్‌లో శని వారం పార్టీ మున్సిపల్‌ ఎన్నికల సన్నాహక సమావే శం నిర్వహించారు. ఎమ్మెల్సీ దండే విఠల్‌, ఖానా పూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌, జిల్లా పరిశీలకులు తాహెర్‌ బిన్‌ హందాన్‌తో కలిసి సమావేశం నిర్వహించిన ఆయన ఎన్నికల్లో అనుసరించాల్సిన కా ర్యాచరణపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తూ వారితో మమేకం కా వాలన్నారు. గెలిచే అభ్యర్థులకే పార్టీ టికెట్లు దక్కుతాయని స్పష్టం చేశారు. ఎవరికి టికెట్‌ వచ్చిన సమన్వయంతో బాధ్యతతో పనిచేయాలన్నారు. అంతకు ముందు జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు నరేశ్‌జాదవ్‌, ఆదిలాబాద్‌ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి, ఆసిఫాబాద్‌ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, బోథ్‌ అసెంబ్లీ ఇన్‌చార్జి ఆడే గజేందర్‌, ఆత్మ చైర్మన్‌ గిమ్మ సంతోష్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అశోక్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్‌ భోజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పారిశ్రామిక హబ్‌గా ఆదిలాబాద్‌

కై లాస్‌నగర్‌: ఆదిలాబాద్‌ను పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్ది, తద్వారా స్థానిక యువతకు భారీ గా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి అన్నారు. జిల్లాలో ఇండస్ట్రీయల్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తామ ని ముఖ్యమంత్రి ఇటీవల ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో శనివారం ఆయన జిల్లా కేంద్రానికి చేరుకుని కలెక్టర్‌ రాజర్షి షాతో సమావేశమయ్యారు. జిల్లాను పారిశ్రామికపరంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందన్నారు. ఈమేరకు అవసరమైన భూమిని గుర్తించాలన్నారు. పారిశ్రామికవేత్తల ను ప్రోత్సహించేలా, ఇండస్ట్రీయల్‌ పార్కుకు సంబంధించిన అన్ని రకాల ప్రభుత్వ అనుమతులను సత్వరమే మంజూరు చేయాలన్నదే ముఖ్య మంత్రి ఉద్దేశమని తెలిపారు. అంతకు ముందు కలెక్టరేట్‌కు చేరుకున్న ఆయనకు కలెక్టర్‌ పూలమొక్క అందజేసి కలెక్టర్‌ స్వాగతం పలికారు. ఆయన వెంట అదనపు కలెక్టర్‌ ఎస్‌.రాజేశ్వర్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement