గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్‌కు ‘తొడసం’
భాష పరిరక్షణకు దక్కిన గుర్తింపు
ఇప్పటికే మన్‌కీ బాత్‌లో కై లాస్‌ను ప్రశంసించిన ప్రధాని
ఢిల్లీ గణతంత్ర వేడుకలకు గిరి ఉపాధ్యాయుడికి ఆహ్వానం
ఆదిలాబాద్‌రూరల్: గోండి, కొలామి భాషల పరిరక్షణకు కృషి చేస్తున్న మావల మండలం వాఘపూర్ గ్రామానికి చెందిన గిరిజన ఉపాధ్యాయుడు తొడ సం కై లాస్‌కు రాష్ట్ర, జాతీయస్థాయిలో గుర్తింపు ల భించింది. తాజాగా ఆయన కృషికి గాను గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్‌కు ఎంపికయ్యారు. అంతేకా కుండా ఢిల్లీలో ఈ నెల 26న ఎర్రకోటలో నిర్వహించనున్న గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు ప్రసా ర భారతి నుంచి ఆహ్వానం అందింది. అయితేహైద రాబాద్‌లో జరిగే వేడుకల్లో తన తరఫున తన కుమారుడు సృజన్‌రామ్ అవార్డును అందుకోనున్నారు.
అంతరించిపోతున్న భాష పరిరక్షణకు కృషి
అంతరించిపోతున్న గోండి, కొలామి భాషల పరిరక్షణకు కై లాస్ తనవంతు కృషి చేస్తున్నాడు. ఏఐ ఉపయోగించి రోబోటిక్ టెక్నాలజీ కంప్యూటర్ ద్వారా యాంకర్‌ను తయారు చేసి గోండి భాషలో వార్తలు చదివించడంతో పాటు గోండి, కొలామి, తెలుగు, హిందీ, ఆంగ్లం, లంబాడా భాషల్లో వందలాది పాటలను రాసి ఏఐలో పొందుపరిచాడు. ఆది వాసీలకు మహాభారత గ్రంథాన్ని అందించాలనే ఉద్దేశంతో తెలుగు లిపి ద్వారా గోండి భాషలో అనువాదించాడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన ఈయన ప్రవత్తి సంగీతం. ఆదివాసీ భాషలను కాపాడడంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. తల్లిదండ్రులు నిరక్షరాస్యులైనప్పటికీ సర్కారు బడుల్లో కష్టపడి చదివి ఉపాధ్యాయ కొ లువును సాధించాడు. విద్యార్థులతో పాటు ఆదివా సీ గిరిజన యువతను ప్రోత్సహిస్తున్నాడు. గతంలో మన్‌కీబాత్‌లో ప్రధాని మోదీ కై లాస్‌ను ప్రశంసించిన విషయం తెలిసిందే.


