ఆ చేతిలో స్టీరింగ్.. సురక్షితం
రోడ్డు ప్రమాదాలు నిత్య కృత్యమైన ఈ రోజుల్లో దశాబ్దాలుగా ఆర్టీసీ బస్సులను నడుపుతున్న వీరు మాత్రం ప్రమాదాలకు దూరంగా ఉంటున్నారు. లక్షలాది మంది ప్రయాణికులను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. డ్రైవింగ్ అంటే ఉద్యోగం మాత్రమే కాదని, బాధ్యతాయుతమైన కర్తవ్యం అని పునఃనిర్వచిస్తున్నారు. ఉద్యోగంలో చేరింది మొదలు, ఇప్పటివరకు ఒక్క ప్రమాదం కూడా జరగకుండా అప్రమత్తంగా వాహనాన్ని నడిపి డ్రైవర్లందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో అలాంటి వారిలో కొందరిపై ఓ లుక్కెద్దామా మరి.
– ఆదిలాబాద్


