మనస్సును నియంత్రించుకోవాలి..
నేను 1994లో ఉద్యోగంలో చేరాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రమాదరహితంగా బస్సును నడుపుతున్నాను. డ్యూటీలోకి ఎక్కిన తర్వాత డ్రైవింగ్‌పై మాత్రమే దృష్టి సారించాలి. అప్పుడే వాహనం మన పూర్తి నియంత్రణలో ఉంటుంది. భావోద్వేగా లు లేకుండా, ఓపికతో మన మనస్సును నియంత్రించుకోవాలి. మూడు దశాబ్దాల నా విధి నిర్వహణలో నేను నేర్చుకున్న విషయం ఇదే. ఈ లక్షణమే నాకు మంచి డ్రైవర్ అనే గుర్తింపునిచ్చింది.
– ఎండి. యూసుఫ్, మంచిర్యాల డిపో
అన్నింటినీ గమనించాలి..
నేను ఉద్యోగంలో చేరి 31 ఏళ్లు దాటింది. డ్యూటీ ఎక్కగానే ముందుగా బస్సు కు సంబంధించిన అన్ని భాగాలు సరిగా ఉన్నాయో లేవో సరి చూసుకుంటాను. స్టీరింగ్ మీదికి వచ్చిన తర్వాత మరోసారి కండిషన్ చెక్ చేసుకుంటాను. రోడ్డు పైకి వెళ్లగానే మన వా హనాన్ని కాకుండా చుట్టూ ఉన్న అన్ని వాహనాల వేగం కదలికలను గమనిస్తూ ఉండాలి. అదే సమయంలో భద్రతా నియమాలు పాటించాలి. అప్పు డే ప్రమాదాలు నివారించే అవకాశం ఉంటుంది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇతర వాహనదారులు అజాగ్రత్తగా ఉంటే ప్రమాదం జరిగే ఆస్కారం ఉంటుంది. – జి. మణి, మంచిర్యాల డిపో
మనస్సును నియంత్రించుకోవాలి..


