తొందరపాటుతోనే ప్రమాదాలు
నేను 1991లో ఉద్యోగంలో జాయిన్‌అయ్యా. ఇన్ని సంవత్సరాలుగా ప్రమాదాలు లేకుండా నడపడానికి ప్రధాన కారణం వేగాన్ని నియంత్రణలో ఉంచుకోవడమే. ఈ రోజుల్లో వీలైనంత త్వరగా గమ్యస్థానానికి చేరుకోవాల ని ప్రతి ఒక్కరూ వేగంగా వెళ్తున్నారు. ఈ తొందరపాటుతోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని బస్సు ను నడిపితే ప్రయాణికులంతా సురక్షితంగా తమ ఇళ్లకు చేరుకుంటారు. ఇదే విషయాన్ని ఆలోచనలో పెట్టుకొని నేను డ్రైవింగ్ చేస్తాను.
– జి. గబ్బర్‌సింగ్, ఉట్నూర్ డిపో
తల్లి ఒడిలా భావిస్తా..
2016లో ఉద్యోగంలో చేరాను. ఆర్టీసీ ప్ర యాణం సుఖప్రదం– సురక్షితం అనే సంస్థ నినాదాన్ని పాటిస్తూ విధులు నిర్వహిస్తున్నా. క్రమశిక్షణగా, ఏకాగ్రతతో నడిపితే ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవు. బస్సు స్టీరింగ్ పట్టింది మొదలు నేను చేసే ఉద్యోగాన్ని బతుకుదెరువుగా కాకుండా, బాధ్యతగా అనుకుంటాను. బస్సును తల్లి ఒడిలా భావించి, ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకి చేర్చడానికి నా శాయశక్తులా కృషి చేస్తాను.
– భాస్కర్, ఆసిఫాబాద్ డిపో
తొందరపాటుతోనే ప్రమాదాలు


