ఆర్టీసీ భద్రతకు మారుపేరు
● ఆర్‌ఎం భవానిప్రసాద్
ఆదిలాబాద్: ఆర్టీసీ భద్రతకు మారుపేరని రీజినల్ మేనేజర్ ఎస్.భవానీప్రసాద్ అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో గ్యారేజీలో శుక్రవారం ఏర్పాటు చేసిన డ్రైవర్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, మానవ తప్పిదాలతోనే ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఆదిలాబాద్ రీ జియన్ రాష్ట్రంలోని అన్ని రీజియన్ల కంటే ఆదాయంలో ముందు స్థానంలో ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంవీఐ హరిందర్ కుమార్, డిప్యూటీ ఆర్‌ఎంలు రామయ్య, శ్రీహర్ష, అధికారులు రమేశ్, జి బ్లా, పండరి, హరిప్రసాద్, రాజశేఖర్, శ్రీనివాస్, రా జేందర్, రాజశేఖర్, శ్రీకర్ పాల్గొన్నారు.


