సరస్వతీ నమస్తుభ్యం
న్యూస్‌రీల్
వసంత పంచమి సందర్భంగా బాసర శ్రీజ్ఞాన సరస్వతీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకుని చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.
ఘనంగా ‘బేతల్’
ఈనెల 18న మహాపూజతో నాగోబా జాతరను ప్రారంభించిన మెస్రం వంశీయులు శుక్రవారం బేతల్‌తో సంప్రదాయ పూజలు ముగించారు.
శనివారం శ్రీ 24 శ్రీ జనవరి శ్రీ 2026
మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతల స్వీకరణ
కైలాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా జి.రాజు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ రాజర్షి షా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్‌ను మర్యాదపూర్వకంగా కలిశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, త్వరలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేలా తగు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక దృష్టి సారిస్తానని పేర్కొన్నారు.
సాత్నాల: మండలంలోని జున్నపాని నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో గల జామిని పాఠశాలకు కాలినడకన వెళ్తున్న విద్యార్థులు
ఆదిలాబాద్‌టౌన్: పేద విద్యార్థులు చదువుకోసం పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. కొన్ని గ్రామాల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు లేకపోవడం, చాలాచోట్ల ఉన్నత పాఠశాలలు లేకపోవడంతో చుట్టుపక్కల గ్రామాలకు వెళ్తూ విద్యనభ్యసిస్తున్నారు. ఇందుకోసం వారు చేస్తున్న ప్రయాణం నరకయాతనగా మారుతోంది. మారుమూల గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడపకపోవడంతో విద్యార్థులకు కాలినడకే దిక్కవుతోంది. మరికొంత మంది ఆటోలు, జీపులు, సైకిళ్లపై ఇబ్బందుల నడుమ వెళ్తున్నారు. పలు ప్రాంతాల్లో బస్సులు నడిచినా ఫుల్లుగా నిండి ఉండటం, స్టాపుల్లో ఆపకపోవడంతో చిన్నారులు పాఠశాలకు ఆలస్యంగా చేరుకుంటున్నారు. అలాగే ఫుట్‌బోర్డు ప్రయాణం ప్రమాదకరంగా మారుతోంది. శుక్రవారం ‘సాక్షి’ ఆయా గ్రామాల్లో పాఠశాలకు వెళ్లే విద్యార్థులను పరిశీలించగా.. వారి అవస్థలు దర్శనమిచ్చాయి.
ఇదీ పరిస్థితి..
విద్యార్థులకు తప్పని తిప్పలు
సర్కారు బడికి వెళ్లేందుకు విద్యార్థులకు తిప్పలు తప్పట్లేదు. కిలోమీటర్ల దూరమైనా కాలినడకే దిక్కవుతోంది. చిట్టి పాదాలు కందిపోతున్నా కనికరించే వారే కరువవుతున్నారు. రోడ్లున్నా కొన్నిరూట్లలో సరిపడా బస్సులు రాని పరిస్థితి. దీంతో కిక్కిరిసి వెళ్లాల్సిన దుస్థితి. జిల్లాలో ఆయా ప్రాంతాల్లో పరిస్థితికి అద్దం పడుతున్న చిత్రాలివి.
సరస్వతీ నమస్తుభ్యం
సరస్వతీ నమస్తుభ్యం
సరస్వతీ నమస్తుభ్యం
సరస్వతీ నమస్తుభ్యం
సరస్వతీ నమస్తుభ్యం
సరస్వతీ నమస్తుభ్యం


