ఆక్సిటోసిన్ ఇంజక్షన్ల పట్టివేత
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా కేంద్రంలో తరలిస్తున్న నిషే ధిత ఆక్సిటోసిన్ ఇంజక్షన్లను టూటౌన్ పోలీసులు గురువారం రాత్రి పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్‌కు అక్రమంగా రవాణా చేయగా, పోలీసులకు వచ్చిన సమాచారంతో స్థానిక బస్టాండ్ వద్ద పార్శిల్ ద్వారా వచ్చిన వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో109ఆక్సిటోసిన్ ఇంజక్షన్ వాయి ల్స్ ఉన్నట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. బిహార్‌కు చెందిన వ్యక్తి తలమడుగు మండలంలోని దేవా పూర్ సమీపంలోని ఓ డెయిరీఫామ్‌లో పనిచేస్తున్నాడు. హైదరాబాద్ నుంచి వీటిని తెప్పించి నట్లు అనుమానిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ వ్యా క్సిన్లపై రాష్ట్రంలో నిషేధం ఉండగా, పశువుల పాల శాతం పెంపు కోసం వీటిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఈ ఇంజక్షన్లతో పశువుల ప్రాణాలతో పాటు వాటి పాలు తాగే ప్రజల ప్రాణాలకు సైతం హాని కలుగుతుందని వివరించారు. స్వాధీనం చేసుకున్న ఇంజక్షన్లను డ్రగ్ ఇన్‌స్పెక్టర్ శ్రీలతకు అప్పగించినట్లు పే ర్కొన్నారు. ఆమె వాటి నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించినట్లు తెలిపారు. నిర్ధారణ అయితే సదరు వ్యక్తిపై కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు.


