పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలి
ఆదిలాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం కార్యకర్తలతో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 49 వార్డుల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానందం, నాయకులు క్రాంతి, రాజు, మాధవరావు, వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు.


