అటవీశాఖతోనే ఇబ్బందులు
అటవీశాఖ అనుమతులివ్వక ఇందిరమ్మ ఇళ్లు, రోడ్ల నిర్మాణాలు ఆగిపోయాయి. ప్రతిపక్షంతో కాదు.. అటవీశాఖతోనే పోరాటం చేయాల్సి వస్తోంది. రోడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసింది. దండారీ డబ్బులు రూ.1.50 కోట్లు విడుదల చేయాలి. ఇందిరమ్మ ఇళ్లకు అనుమతులివ్వాలి. ప్రజాప్రభుత్వం ఏర్పాటులో ఆదివాసీల పాత్ర కీలకం. పోడు భూములకు పట్టాలిచ్చేందుకు ప్రభుత్వం చొరవ చూపాలి.
– వెడ్మ బొజ్జు పటేల్, ఖానాపూర్ ఎమ్మెల్యే
అటవీ సమస్యలు పరిష్కరించాలి
గిరిజన ప్రాంతంలో అటవీశాఖ అధికారులతో ఆదివాసీ గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. ఇందిరమ్మ, పీఎం ఆవాస్ యోజన కింద మంజూరైన ఇండ్లు ఆగిపోయాయి. రోడ్లకు అనుమతులు లేక పనులు అర్ధంతరంగా నిలిచిపోతున్నాయి. రోడ్డు సౌకర్యం లేక గర్భిణులు అవస్థలు పడుతున్నారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవి. వెనుకబడిన జిల్లాను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేయాలి.
– పాయల్ శంకర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే
దర్బార్ సమస్యలు పరిష్కరిస్తాం
దర్బార్‌లో తెలిపిన సమస్యలు పరిష్కరిస్తాం. త్వ రలోనే రుణాలు అందించేలా చర్యలు చేపడతా ం. ఉట్నూర్‌లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పా ఠశాల ఏర్పాటుకు డిప్యూటీ సీఎం శంకుస్థాప న చేశారు. పోడు భూముల పట్టాలిచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. జిల్లాలో 16,405 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.156 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఆదిలాబాద్ జిల్లా పదో స్థానంలో ఉంది.
– రాజర్షి షా, కలెక్టర్
అటవీశాఖతోనే ఇబ్బందులు
అటవీశాఖతోనే ఇబ్బందులు


