● ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ● దేవ్‌గూడలో విస్తృత ప
ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ఉట్నూర్‌రూరల్: ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గురువారం మండలంలోని దేవ్‌గూడ గ్రామంలో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న పౌష్టికాహారం, ప్రీ స్కూల్ విద్యా సదుపాయాల గురించి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. అర్హులందరికీ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, నిధుల విడుదల, మౌలిక వసతుల కల్పన విషయాల్లో లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కేబీ కాంప్లెక్స్‌లో భట్టికి పలువురు వినతిపత్రాలు అందజేశా రు. ఆయన వెంట ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో యువరాజ్ మర్మాట్, జీసీసీ చైర్మన్ తిరుపతి కోట్నాక్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


