గణతంత్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు
కై లాస్‌నగర్: ఈ నెల 26న నిర్వహించనున్న గణతంత్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వేడుకల ఏర్పాట్లు, బోథ్ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో నిర్వహించనున్న క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పోలీస్ పరేడ్ మైదా నంలో వేదిక నిర్మాణం, టెంట్లు, సీటింగ్, పబ్లిక్ అ డ్రస్ సిస్టమ్, ఇతర ఏర్పాట్లు పక్కగా ఉండాలని తె లిపారు. స్వాతంత్య్ర సమరయోధులు, ప్రజలు, వి ద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని ఆదేశించా రు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉ ద్యోగుల జాబితాను పారదర్శకంగా రూపొందించి, ప్రశంసాపత్రాల పంపిణీకి సిద్ధం చేయాలని సూ చించారు. ప్రగతి నివేదికలను శాఖలవారీగా అధికా రులు శుక్రవారంలోపు డీపీఆర్వో కార్యాలయంలో అందజేయాలని ఆదేశించారు. బోథ్ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో పర్యాటక శాఖ స్పాన్సర్ షిప్‌తో నిర్వహించనున్న క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. అడిషనల్ కలెక్ట ర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, ఆర్డీవో స్రవంతి, ము న్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు తదితరులున్నారు.


