మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతాం
కై లాస్‌నగర్: మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ ముందుకుసాగుతుందని ఆదిలాబా ద్ జిల్లా పరిశీలకుడు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ పేర్కొన్నారు. గురువారం పార్టీ శ్రేణులతో కలిసి జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆశావహుల జాబితాను పరిశీలించి హైకమాండ్ ఆదేశానుసారం మూడు దశల్లో సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 26వరకు సర్వే నివేదిక వస్తుందని, సర్వే ఆధారంగా గెలిచే సత్తా ఉన్న వారికే పార్టీ బీ ఫాంలు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. మున్సిపల్ పీఠం కై వసం చేసుకోవడమే పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీతోనే తమకు పోటీ ఉంటుందని తెలిపారు. 250 మందికి పైగా పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. ఆత్మ చైర్మన్ గిమ్మ సంతోష్, డీసీసీబీ మాజీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మాజీ కౌన్సిలర్లు కలాల శ్రీనివాస్, అర్చన రామ్‌కుమార్, డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, నాయకులు లోక ప్రవీణ్‌రెడ్డి, గుడిపల్లి నగేశ్, మునిగెల నర్సింగ్, సుఖేందర్, ఎంఏ షకీల్, డేరా కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


