‘బల్దియాపై జెండా ఎగురవేస్తాం’
ఆదిలాబాద్‌టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ జెండా ఎగురవేస్తామని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ధీమా వ్యక్తం చేశారు. గురువారం జి ల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పట్టణ కమిటీ సమావేశంలో మున్సిపల్ ఎన్నిక ల నేపథ్యంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ హ యాంలోనే పట్టణాభివృద్ధి సాధ్యమైందని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు హా మీల అమలులో విఫలమయ్యాయని ఆరోపించారు. ‘బాకీ కార్డు’తో పాటు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తు చేస్తూప్రచారం నిర్వహించాలని సూచించారు. ఏడాదికి ఐదువేల ఉద్యోగాల హామీ ఏమైందని ఆదిలా బాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ను నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్టీ క్యాలెండర్ ఆవిష్కరించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ జోగు ప్రేమేందర్, పార్టీ పట్టణాధ్యక్షుడు అజయ్, నాయకులు యాసం నర్సింగరావు, సాజిదొద్దీన్, ప్రహ్లాద్, రమేశ్, స్వరూపారాణి, పర్వీన్ తదితరులున్నారు.


