ఇంటివద్దకే మేడారం ప్రసాదం
ఆదిలాబాద్: మేడారం మహాజాతరకు వెళ్లలేని భక్తులకు కార్గో ద్వారా ఇంటివద్దకే ప్రసాదం పంపించనున్నట్లు ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి తెలిపారు. గురువారం ఆమె తన కార్యాలయంలో ఇందుకు సంబంధించిన ప్రచార పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. https:// Tgsrtclogictics. co. in ద్వారా లేదా కార్గో కౌంటర్లలో రూ.299 చెల్లించి బుక్ చేసుకోవా లని సూచించారు. పూర్తి వివరాలకు 91542 98531, 9154298553, 9154298533 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో లాజిస్టిక్స్ (కార్గో) రీజినల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ సాయన్న, డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అన్సారీ, డీఎం కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


