డిఫెన్సివ్ డ్రైవింగ్‌తో ప్రమాదాల నివారణ
ఆదిలాబాద్‌టౌన్: డిఫెన్సివ్ డ్రైవింగ్‌తో రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఆటో, టాక్సీ, లారీ డ్రైవర్లకు బుధవారం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలని సూచించారు. పట్టణానికి చెందిన సుమారు 300 మంది ఆటో, టాక్సీ, లారీడ్రైవర్లకు రిమ్స్ సూపర్ స్పెషాలిటీ వైద్యులు సుమన్, ప్రశాంతి పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా కంటి అద్దాలు అందజేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఇందులో డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐలు బి.సునీల్ కుమార్, కె.నాగరాజు, బి.ప్రణయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


