‘ఉపాధి’ పథకం పేరు మార్పు సరికాదు
కై లాస్‌నగర్: అట్టడుగు వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుపేదలకు లబ్ధి చేకూర్చే మ హాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్ముని పేరు తొలగించడం సరి కాదని డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్ర పంచానికి ఆదర్శంగా నిలిచిన మహాత్మాగాంధీ పేరు ఈ పథకానికి ఉండటం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటని, ఆయన పేరు తొలగింపు ద్వారా కలిగిన లాభమేంటని ప్రశ్నించారు. ఈనెల 26న ప్రతీ గ్రామ పంచా యతీలో కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలని పిలుపునిచ్చారు. తీర్మాన ప్ర తులను రాష్ట్రపతికి పంపిస్తామని వెల్లడించా రు. అనంతరం కరపత్రాలు విడుదల చేశారు. ఇందులో పార్టీ నాయకులు సుజాత, సాజిద్ ఖాన్, సంజీవరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు


