ముగిసిన కబడ్డీ పోటీలు
కై లాస్‌నగర్(బేల): బేల మండలంలోని సదల్‌పూర్ భైరందేవ్ జాతర పురస్కరించుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వారం పాటు నిర్వహించిన కబడ్డీ పోటీలు బుధవారంతో ముగిశాయి. ఆలయ ప్రాంగణంలో రాత్రి నిర్వహించిన ముగింపు పోటీల అనంతరం విజేత జట్లకు బహుమతి ప్రదానం చేశారు. సోన్‌కాస్ జట్టు (ప్రథమ), పోహర్ గ్రామ జట్టు(ద్వితీయ), సదల్‌పూర్ జట్టు తృతీయ, మెహన్‌రావుగూడ (నాలుగో) బహుమతులు కై వసం చేసుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కొరంగే శ్యామ్‌రావు, సామ రూపేశ్‌రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు సిడాం కుషాల్‌రావు, సర్పంచులు మంగేష్, గంభీర్, అవినాష్, శంకర్, బాపురావు, జంగు, జితేందర్, కన్యరాజు, నయన్, సతీష్, రవీందర్ పాల్గొన్నారు.


