మున్సిపల్ కమిషనర్‌గా జి.రాజు
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా జి.రాజు నియామకమయ్యారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న, జిల్లావాసులైన కమిషనర్లకు రాష్ట్ర ప్రభుత్వం స్థానచలనం కల్పించింది. ఇందులో భాగంగా మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి గ్రేడ్–2 మున్సిపాలిటీ కమిషనర్‌గా పనిచేస్తున్న జి.రాజును ఆదిలాబాద్‌కు బదిలీ చేసింది. ఇక్కడ పనిచేసిన ఆదిలాబాద్ పట్టణానికి చెందిన సీవీఎన్ రాజును పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సెక్రెటరీగా స్థానచలనం కల్పించింది. ఈ మేరకు మున్సిపల్ డైరెక్టర్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో నూతన కమిషనర్ గురువారం బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లుగా బల్దియా వర్గాలు తెలిపాయి.


