ఉత్సాహంగా సీఎం కప్ టోర్నీ
ఆదిలాబాద్: క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గతేడాది సీఎం కప్ పోటీలను ప్రారంభించింది. ఈ ఏడాది రెండో ఎడిషన్ పోటీలను నిర్వహిస్తోంది. ఈనెల 17నుంచి గ్రామ పంచాయతీ స్థాయి పోటీలు ప్రారంభమయ్యాయి. ఉత్సాహంగా కొనసాగుతున్నాయి.
ఐదు స్థాయిల్లో..
ఈ పోటీలను ఐదు స్థాయిల్లో నిర్వహిస్తున్నారు. గ్రా మపంచాయతీ, మండల/మున్సిపాలిటీ, నియోజ కవర్గం, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో జరగనున్నాయి. పంచాయతీ స్థాయిలో ఈనెల 17 నుంచి 26 వరకు, మండల, మున్సిపాలిటీ స్థాయిలో ఈనెల 28 నుంచి 31వరకు పోటీలు నిర్వహించనున్నారు. ఇక నియోజకవర్గ స్థాయి పోటీలు ఫిబ్రవరి 3 నుంచి 5వరకు, జిల్లా స్థాయి పోటీలు 9 నుంచి 12వరకు జరగనుండగా, ఇందులో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను 20 నుంచి 23వరకు నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. నియోజకవర్గ, జిల్లా స్థాయి పోటీలను ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వేదికగా నిర్వహిస్తారు.
తేదీల వారీగా మండలాల్లో..
ఈనెల 28న ఆదిలాబాద్‌రూరల్, భోరజ్, జైనథ్, బేల, సాత్నాల మండలాల్లో, 29న ఆదిలాబాద్ ము న్సిపాలిటీ, తాంసి, తలమడుగు, భీంపూర్, గాది గూడ మండలాల్లో పోటీలు ఉండనున్నాయి. 30న మావల, గుడిహత్నూర్, ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్ మండలాల్లో, 31న ఇచ్చోడ, సిరికొండ, నేరడిగొండ, బోథ్, బజార్‌హత్నూర్, సొనాల మండలాల్లో పోటీలు నిర్వహించనున్నారు.
ఈ క్రీడాంశాల్లో..
పంచాయతీ స్థాయిలో అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, యోగా పోటీలు నిర్వహిస్తున్నా రు. మండల, మున్సిపల్, నియోజకవర్గ స్థాయిలో గ్రామస్థాయితోపాటు చెస్, కరాటే పోటీలు అదనంగా ఉంటాయి. జిల్లాస్థాయిలో వీటితో పాటు బ్యా డ్మింటన్, బేస్‌బాల్, బాస్కెట్ బాల్, రెజ్లింగ్, సాఫ్ట్‌బాల్, నెట్‌బాల్, వుషూ, జూడో, బాల్ బాడ్మింటన్, సైక్లింగ్, స్విమ్మింగ్, తైక్వాండో, క్యారమ్, హాకీ, బా క్సింగ్, కిక్ బాక్సింగ్, పారాగేమ్స్‌లలో పోటీలు ఉంటాయి. రాష్ట్రస్థాయిలో జిల్లా స్థాయిలోని క్రీడలతో పాటు జిమ్నాస్టిక్స్, పవర్ లిఫ్టింగ్, స్కె టింగ్, ఆర్చ రీ, ఆత్యాపాత్య,బిలియర్డ్స్‌అండ్ స్నూకర్, కనోయింగ్, కయాకింగ్,ఫెన్సింగ్, లాన్‌టెన్నీస్,మల్లఖంబం, పికిల్‌బాల్ వంటి క్రీడాంశాల్లో పోటీలు ఉంటాయి.
అర్హులు వీరే..
సబ్ జూనియర్ స్థాయి నుంచి జూనియర్, సీనియర్ విభాగాల్లో బాల బాలికలు, మహిళలు, పురుషులు పాల్గొనేందుకు అవకాశం ఉంది. అండర్–14 నుంచి అండర్–23 వరకు, సీనియర్ స్థాయిలో పోటీ పడేందుకు అవకాశం ఉంటుంది.
రిజిస్ట్రేషన్ విధానం..
ఆసక్తి, అర్హత గల క్రీడాకారులు సీఎం కప్ పోటీల్లో పాల్గొనేందుకు సీఎం కప్ మొబైల్ యాప్ ద్వారా, https:// satg. telangana. gov. in/ cmcup వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
పకడ్బందీగా పోటీల నిర్వహణ
పోటీలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే గ్రామస్థాయిలో క్రీడా పోటీలు మొదలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఈ సారి సుమారు 14వేల మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈసారి పారా అథ్లెట్లకు సైతం పోటీలు నిర్వహించనున్నాం.
– జక్కుల శ్రీనివాస్, డీవైఎస్‌వో


