హక్కుల సాధన కోసం పోరాడాలి
ఆదిలాబాద్‌టౌన్: ఉద్యోగులు సంఘటితంగా ఉంటూ హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడాల ని టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి ఎ.నవీన్ కుమార్, తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సందిల బలరామ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బజరంగ్ ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల ఫోరం సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించారు. ఫెడరేషన్‌లోని ప్రతీ కార్యదర్శి టీఎన్జీవో సభ్యత్వం తీసుకొని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరంలో విలీనం అయ్యారు. అనంతరం జిల్లా ఫోరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జె.సంజీవరావు, ప్రధాన కార్యదర్శిగా కె.అరుణ్‌రెడ్డి, కోశాధికారిగా అనిల్ రెడ్డి, అసోసియేట్ అధ్యక్షులుగా డి.నాగభూషణ్, రాందాస్, బి.వినోద్, వైస్ ప్రెసిడెంట్‌గా సూర్యప్రకాశ్, జాయింట్ సెక్రెటరీగా గంగన్న, ఉమెన్ జాయింట్ సెక్రెటరీగా నస్సేమ, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా సత్యనారాయణతో పాటు మిగిలిన కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా మాజీ అధ్యక్షుడు అశోక్, ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేందర్, సునీల్ రెడ్డి, రాఘవేంద్ర, దుర్గయ్య, నాగభూషణ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.


