ప్రశాంతంగా ఇంగ్లిష్ ప్రాక్టికల్
ఆదిలాబాద్‌టౌన్: ఇంటర్‌మీడియెట్ ఇంగ్ల్లిష్ ప్రాక్టికల్ పరీక్ష బుధవారం ప్రశాంతంగా ముగిసింది. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా 75 ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో పరీక్ష నిర్వహించారు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన పరీక్షను డీఐఈవో జాదవ్ గణేశ్ కుమార్ పరిశీలించారు. గురువారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్ష ఉంటుందని తెలిపారు. అలాగే ఈనెల 23న మానవ నైతిక విలువ పరీక్ష ఉంటుందని వివరించారు. 24న ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పర్యావరణ విద్య పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.
రేపు కళాశాలల్లో పేరెంట్స్ మీటింగ్
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈనెల 23న పేరెంట్ టీచర్స్ మీటింగ్ (ఎంపీటీఎం) నిర్వహించాలని డీఐఈవో జాదవ్ గణేశ్‌కుమార్ ప్రకటనలో తెలి పారు. ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు తప్పనిసరిగా సమావేశం నిర్వహించాలని ఆయా ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. తల్లిదండ్రులు సమావేశానికి హాజరు కావాలని కోరారు.


