మున్సి‘పోల్’కు కాంగ్రెస్ ఇన్‌చార్జీలు
కై లాస్‌నగర్: త్వరలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. అన్ని బల్దియాలను కై వసం చేసుకోవడమే లక్ష్యంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పలువురికి బాధ్యతలు అప్పగించింది. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డిని ఇన్‌చార్జిగా నియమించింది. ఆది లాబాద్, నిర్మల్, ముధోల్, ఖానాపూర్, సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల పరిధిలో గల ము న్సిపాలిటీ ఎన్నికల వ్యవహారాలన్నీ ఆయన పర్యవేక్షణ లోనే జరగనున్నాయి. అలాగే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని మంచిర్యాల కార్పొరేషన్‌తో పాటు బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్గాల పరిధిలోని మున్సిపాలిటీల బాధ్యతలను ఆయన పర్యవేక్షించనున్నా రు. ఎన్నికలయ్యేంత వరకు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ కార్యకర్తలు, నాయకులను సంసిద్ధుల ను చేయాల్సిందిగా అధిష్టానం వారికి బాధ్యతలు అప్పగించింది. మంత్రి జూపల్లి ఇప్పటికే తూర్పు ప్రాంతంలో పర్యటిస్తూ వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. సుదర్శన్ రెడ్డి త్వరలోనే జిల్లాలో పర్యటించే అవకాశమున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం, గెలుపు దిశగా అనుసరించాల్సి న కార్యాచరణ వంటి అంశాలన్నింటినీ వారు ఆయా జిల్లాలోని ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులు, నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగనున్నారు.


