‘ఇందిరమ్మ’ చీరలు వచ్చేశాయ్
కై లాస్‌నగర్: జిల్లా కేంద్రంలోని మహిళలకు ప్రభుత్వం ఇందిరమ్మ చీరలు అందించనుంది. ఇది వర కు గ్రామీణ ప్రాంతాల వారికి అందించగా తాజాగా పట్టణ ప్రాంతంలో పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాకేంద్రంలో ఎస్‌హెచ్‌జీ సభ్యులు 26,897 మందితో పాటు 18 ఏళ్లు నిండిన మహిళలతో కలిపి పట్టణానికి 57,509 చీరలు అవసరమైనట్లుగా అధికారులు గుర్తించారు. ఇందులో 9 మీ టర్ల గోచి చీరలు 2,793, ఆరు మీటర్ల చీరలు 54,716 అవసరం కానున్నాయి. అయితే ఇప్పటి వరకు 44,563 చీరలు జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. వాటిని వ్యవసాయ మార్కెట్ యార్డులోని గోదాంలో భద్రపరిచారు. నేటి నుంచి 87 రేషన్‌షాపులతో పాటు ప్రభుత్వ పాఠశాలలు, కమ్యూనిటీ హాల్స్, అంగన్‌వాడీ కేంద్రాల్లో వీటిని పంపిణీ చేయనున్నట్లుగా మెప్మా అధికారులు శ్రీనివాస్, భాగ్యలక్ష్మి తెలిపారు. ఈమేరకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించారు.


