● ప్రజావాణికి 98 దరఖాస్తులు ● అర్జీలు స్వీకరించిన కలెక్
సమస్యల వెల్లువ
కై లాస్‌నగర్: భూ సమస్యలు పరిష్కరించాలని కొందరు.. పింఛన్లు మంజూరు చేయాలని మరికొందరు.. ఇందిరమ్మ ఇళ్లు అందించాలని ఇంకొందరూ ఇలా పలు సమస్యలతో తరలివచ్చిన బాధితులు కలెక్టర్ రాజర్షి షా ఎదుట తమ గోడు వినిపించారు. పరిష్కరించాలని వేడుకున్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో బాధితుల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేస్తూ పరిష్కరించాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉంచొద్దని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ వారం వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 98 అర్జీలు అందాయి. అందులో కొందరి నివేదన.


