ప్రయోగ పరీక్షలకు వేళాయె
కళాశాలలు విద్యార్థులు విద్యార్థులు
మంచిర్యాలఅర్బన్: ఇంటర్ విద్యార్థులు వార్షిక పరీక్షలకు ముందు నిర్వహించే ప్రయోగ పరీక్షలకు అంతా సిద్ధమైంది. ఈనెల 21,22న నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈ పరీక్షలు మొదలుకానున్నాయి. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడు విడతలుగా నిఘా కెమెరా నీడన నిర్వహించనున్నారు. ఉదయం, మధ్యాహ్నం వేళ పరీక్షలు జరుగనున్నాయి. 21న ప్రథమ సంవత్సర విద్యార్థులకు పరీక్ష ఉంటుంది. 22న ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఆంగ్ల ప్రయోగ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్ జనరల్, వృత్తి విద్యాకోర్సుల విద్యార్థులు తప్పసరిగా పరీక్ష రాయాల్సి ఉంటుంది. సైన్స్, వృత్తి విద్యాకోర్సులు చదువుతున్నవారు ప్రథమ, ద్వితీయ సంవత్సరం వారికి ఫిబ్రవరి 2 నుంచి ఈ పరీక్షలు ఉంటాయి.
పరీక్ష ఇలా..
ఆంగ్ల సబ్జెక్టు 100 మార్కుల పేపర్‌లో 20 మార్కులు ప్రయోగ పరీక్ష, 80 మార్కులు థియరీ కేటాయించారు. రెండేళ్ల క్రితం నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షకు సంబంధించిన ఆంగ్ల రికార్డులు సైతం విద్యార్థులు రాయాల్సి ఉంటుంది. 24 ఎథిక్స్ పరీక్ష నిర్వహించనున్నారు. 100 మార్కులకు గాను 60 మార్కులు రాత పరీక్ష, 40 మార్కులకు రికార్డు, ప్రాజెక్టు సంబంధించిన నోట్స్‌లను పరీక్ష కేంద్రంలో అప్పగించాల్సి ఉంటుంది. ప్రథమ సంవత్సరం చదివే విద్యార్థులు ఇందులో అర్హత సాధిస్తేనే వార్షిక పరీక్షలకు సంబంధించిన ఫలితం ప్రకటిస్తారు.
22న పరీక్షపై గందరగోళం
ఇంజినీరింగ్ కళాశాలలో ప్రవేశానికి నిర్వహించే జాతీయస్థాయి పరీక్ష (జేఈఈ మెయిన్స్) పరీక్ష, ఆంగ్ల పరీక్షలు 22న రెండు ఉండటంతో గందరగోళం నెలకొంది. ఈనెల 21, 22, 23, 24, 28న పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యాయి. ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థులకు ఆంగ్లపరీక్ష, జేఈఈ మెయిన్స్ ఒకే రోజు ఉండటంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఇబ్బంది లేకున్నా 22న జేఈఈ మెయిన్స్ పరీక్షలు రాసే విద్యార్థులు ఎలా హాజరుకావాలో తెలియడం లేదు. ఆంగ్ల పరీక్షలు ఉంటాయా.. మరో తేదీకి వాయిదా వేస్తారా అనేది ఇంకా స్పష్టత రాలేదు.
పరీక్షలకు హాజరుకావాలి
ఆంగ్లప్రయోగ, పర్యావరణ విద్య పరీక్షకు విద్యార్థులు తప్పనిసరిగా హాజరుకావాలి. పరీక్షలు రాయకుంటే థియరీలో ఉత్తీర్ణులైన ఫలితం వెలువడదు. 22న జేఈఈ మెయిన్స్ పరీక్షలు రాసే విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆంగ్ల పరీక్ష నిర్వహణపై ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.
– అంజయ్య, డీఐఈవో, మంచిర్యాల
ఇంటర్ కళాశాలల వివరాలు
జిల్లాలు ప్రభుత్వ ఫస్టియర్ సెకండియర్
మంచిర్యాల 10 1,974 1,676
నిర్మల్ 13 2,592 2,252
కుమురం భీం 11 2,575 2,048


