ఉత్సాహంగా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు

Jan 19 2026 4:25 AM | Updated on Jan 19 2026 4:25 AM

ఉత్సా

ఉత్సాహంగా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు

● ఓవరాల్‌ చాంపియన్‌గా ములుగు జిల్లా

ఆదిలాబాద్‌: 11వ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ (సబ్‌ జూనియర్‌) పోటీల ఓవరాల్‌ చాంపియన్‌గా ములుగు జిల్లా నిలిచింది. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆదివారం నిర్వహించిన పోటీలను ఎంపీ నగేశ్‌, కలెక్టర్‌ రాజర్షి షా, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ప్రారంభించారు. 33 జిల్లాలకు చెందిన క్రీడాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ నగేశ్‌ మాట్లాడుతూ చిన్ననాటి నుంచి పిల్లల్లో ఆటలపై మక్కువ పెరిగేలా తల్లిదండ్రులు ప్రోత్సాహం అందించాలన్నారు. జిల్లాలో ప్రతిభగల క్రీడాకారులు ఉన్నారని తెలిపారు. తన స్వగ్రామంలోనే ట్రైబల్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌ ఏర్పాటుకు కృషి చేశానన్నారు. అదేవిధంగా స్టేడియంలో సింథటిక్‌ ట్రాక్‌ ఏర్పాటుకు కృషి చేస్తానని, హాకీ టర్ఫ్‌ కోర్టు ఏర్పాటయ్యేలా దృష్టి సారిస్తున్నానని తెలిపా రు. కలెక్టర్‌ రాజర్షి షా, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్బిన్‌ హందాన్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో ప్రతిభ దాగి ఉందని, ఇలాంటి పోటీలు వారి నైపుణ్యాన్ని వెలికితీస్తాయన్నారు. కార్యక్రమంలో ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ పాల్గొని క్రీడాకారులకు బహుమతులు అందించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మల్లెపూల నర్సయ్య, అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, ఒలింపిక్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్‌రెడ్డి, డీవైఎస్‌ఓ జక్కుల శ్రీనివాస్‌, డీటీఎస్‌ఓ పార్థసారథి, నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నరేశ్‌జాదవ్‌, కంది శ్రీనివాస్‌రెడ్డి, అసోసియేషన్‌ రాష్ట్ర బాధ్యులు సారంగపాణి, వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్‌, వీజీఎస్‌ రాకేశ్‌ పాల్గొన్నారు.

విజేతలు వీరే..

అండర్‌–8 బాలుర విభాగంలో 10 పాయింట్లతో జగిత్యాల, బాలికల విభాగంలో 8 పాయింట్లతో కామారెడ్డి విజేతలుగా నిలిచాయి. అండర్‌–10 బాలుర విభాగంలో 6 పాయింట్లతో సంయుక్తంగా ములుగు, మంచిర్యాల జిల్లాలు విజేతలుగా నిలిచాయి. బాలికల విభాగంలో 8 పాయింట్లతో ములుగు, మహబూబాబాద్‌ జిల్లాలు సంయుక్త విజేతలుగా సత్తా చాటాయి. అండర్‌–12 బాలుర విభాగంలో 7 పాయింట్లతో ఆదిలాబాద్‌, బాలికల విభాగంలో 8 పాయింట్లతో నారాయణపేట చాంపియన్‌షిప్‌ సాధించాయి. అండర్‌–14 బాలుర విభాగంలో 8 పాయింట్లతో వనపర్తి, బాలికల విభాగంలో 10 పాయింట్లతో హన్మకొండ గెలుపొందాయి. ఇక 19 పాయింట్లతో అన్ని విభాగాల్లో కలిసి ములుగు ఓవరాల్‌ చాంపియన్‌ షిప్‌ కై వసం చేసుకుంది.

ఉత్సాహంగా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు1
1/1

ఉత్సాహంగా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement