స్వగ్రామానికి చేరిన మృతదేహాలు
లక్సెట్టిపేట: తమిళనాడులోని కన్యాకుమారి వద్ద ఈనెల 14న జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు పాలకుర్తి సత్యనారాయణ, రమాదేవి మృతిచెందారు. వారి మృతదేహాలు శనివారం రాత్రి పట్టణంలో బీట్ బజార్‌లోని స్వగృహానికి తీసుకువచ్చారు. ఆదివారం బీట్‌బజార్ నుంచి గోదావరి శ్మశానవాటిక వరకు నిర్వహించిన అంతిమయాత్రలో కుటుంబీకులు, ప్రజాప్రతినిధులు, వ్యాపార సంఘ నాయకులు పాల్గొన్నారు. డప్పుచప్పుళ్లతో సుమారు 600 మంది వచ్చారు. ఇద్దరు కూతుళ్లు పాడె మోశారు. ఇద్దరు అల్లుళ్లు మృతదేహాలకు తలకొరివి పెట్టారు. వ్యాపార సంఘం ఆధ్వర్యంలో దుకాణాలు బంద్ పాటించారు.


