పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి
శ్రీరాంపూర్: సింగరేణి కార్మికుల పెండింగ్ డిమాండ్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఐఎన్‌టీయూసీ జనరల్ సెక్రెటరీ బి.జనక్‌ప్రసాద్ తెలిపారు. ఆదివారం ఆయన నస్పూర్ కాలనీలోని శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈనెల 13న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో జరగాల్సిన అనివార్య కారణాలతో వాయిదా పడిందన్నారు. త్వరలో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఇందులో సింగరేణి ప్రధాన డిమాండ్లపై చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కంపెనీకి పూర్తిస్థాయి సీఎండీ నియమించాలని, సింగరేణి కార్మికులకు సొంతింటి పథకం అమలు చేయాలని, వారికి కోలిండియాలో ఇస్తున్నట్లు పెర్క్స్‌పై ఆదాయ పన్ను కంపెనే చెల్లించాలన్నారు. మారుపేర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతామన్నారు. ప్రతీనెల కార్పొరేట్ మెడికల్ బోర్డు నిర్వహించి 95 శాతం మెడికల్ ఇన్వాలిడేషన్ అమలు చేయాలన్నారు. హైదరాబాద్‌తోపాటు రీజియన్ల వారీగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలన్నారు. గనులు ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. సమావేశంలో యూనియన్ సీనియర్ ఉపాధ్యక్షుడు కాంపెల్లి సమ్మయ్య, ఉపాధ్యక్షులు జట్టి శంకర్‌రావు, ప్రధాన కార్యదర్శులు ఏనుగు రవీందర్‌రెడ్డి, జీవన్ జోయల్, నాయకులు నరేందర్, తిరుపతి రాజు, భీంరావు, మనోజ్, పేరం రమేశ్, రాపర్తి శ్రీనివాస్, శీలం చిన్నయ్య, చందు పాల్గొన్నారు.


