టెట్ మినహాయించాలి
ఆదిలాబాద్‌టౌన్: సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజేందర్ కోరారు. ఆదివా రం జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మా ట్లాడుతూ.. సుప్రీం కోర్టు రెండేళ్లలో టీచర్లు టె ట్ ఉత్తీర్ణులు కావాలని తీర్పునిచ్చిందని తెలి పారు. వచ్చే నెలలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో టెట్‌పై చట్ట సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులకు 51శాతం ఫిట్‌మెంట్ అమలు చేయడంతో పాటు ఆరో గ్య కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.
సమావేశంలో సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, రవికుమార్, సంఘ బాధ్యులు బెజ్జంకి రవీంద్ర, నరేందర్, సత్యనారాయణ, మనోహర్, దేవిదాస్, శీతల్ చౌహాన్, జాదవ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.


