నేడు చనాక–కొరాట పంపు హౌస్ నుంచి నీటి విడుదల
న్యూస్‌రీల్
సాత్నాల: చనాక–కొరాట పంపు హౌస్ నుంచి సోమవారం నీటిని విడుదల చేయనున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ప్రభు ఓ ప్రకటనలో తెలిపారు. భోరజ్ మండలం గూడ గ్రామం నుంచి బేల మండలం ఛాప్రాల గ్రామం వరకు లోయర్ పెన్‌గంగా పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం నీరు పంపుహౌస్ నుంచి ప్రధాన కాలువలో ఎత్తి పోయనున్నట్లు తెలిపారు. లోయర్ పెన్‌గంగా ప్రధాన కాలువ పరిసర ప్రాంతాల ప్రజలు ప్ర ధాన కాలువ వద్దకు పోవద్దని పేర్కొన్నారు. ఆయకట్టు రైతులు నీటి పారుదల అధికారులను సమన్వయం చేసుకుని నీటిని సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు.
యథావిధిగా బడి వేళలు
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో చలి తీవ్రత కారణంగా గతనెల పాఠశాల పనివేళల్లో మార్పులు చేసిన విషయం తెలిసిందే. చలి తీవ్రత తగ్గడంతో పనివేళలను యథావిధిగా కొనసాగించాల ని కలెక్టర్ రాజర్షిషా ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 9నుంచి సాయంత్రం 4.15గంటల వరకు బడులు నిర్వహించాలని ఆదేశించారు.
నేడు చనాక–కొరాట పంపు హౌస్ నుంచి నీటి విడుదల
నేడు చనాక–కొరాట పంపు హౌస్ నుంచి నీటి విడుదల
నేడు చనాక–కొరాట పంపు హౌస్ నుంచి నీటి విడుదల


