అరుదైన అతిథులొచ్చాయ్..!
బోథ్: సొనాల మండలంలోని గొల్లాపూర్ చెరువు అంతర్జాతీయ వలస పక్షులకు నిలయమైంది. అట వీశాఖ, డబ్ల్యూడబ్ల్యూఎఫ్–ఇండియా సంయుక్తంగా నిర్వహించిన పక్షుల గణనలో సుమారు 300కు పైగా అరుదైన ‘బార్–హెడెడ్ గీసుల’ను అధికారులు గుర్తించారు. మధ్య ఆసియా, టిబెట్ లాంటి సు దూర ప్రాంతాల నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి శీతాకాల విడిది కోసం ఈ పక్షులు ఏటా భారతదేశంలోని జలవనరులను ఆశ్రయిస్తుంటాయి. గొల్లాపూర్ చెరువులో ఇవి భారీ సంఖ్యలో కనిపించడం ఇక్కడి జీవ వైవిధ్యం, పర్యావరణ ఆరోగ్యానికి నిదర్శనమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇవి ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఎగిరే పక్షి జాతిగా గుర్తింపు పొందడం విశేషం. అత్యంత తక్కువ ఆక్సిజన్ ఉండే హిమాలయ పర్వత శ్రేణులనూ దాటి రాగలిగే అసాధారణ సామర్థ్యం వీటికి ఉందని ఎఫ్‌ఆర్వో ప్రణయ్ తెలిపారు. గొల్లాపూర్ చెరువులో నీటి నాణ్యత, సమృద్ధిగా ఆహారం లభి స్తుండటంతో ఇవి ఇక్కడ తలదాచుకుంటున్నాయని పేర్కొన్నారు. ఈ అరుదైన పక్షుల ఉనికి సొనాల మండలానికి గర్వకారణమని, వీటిని చూడటానికి పక్షి ప్రేమికులు ఆసక్తి చూపుతుండటంతో భవిష్యత్‌లో ఇక్కడ పక్షి పర్యాటకం అభివృద్ధి చెందే అవకాశముందని పర్యావరణ వేత్తలు భావిస్తున్నారు.
భద్రతపై ప్రత్యేక దృష్టి
ఈ వలస పక్షుల భద్రతపై అటవీ అధికారులు ప్ర త్యేక దృష్టి సారించారు. అక్రమ వేట, నీటి కాలు ష్యం, శబ్ద కాలుష్యం లాంటి కారణాలతో పక్షులకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని తెలిపారు. వీటి ని కట్టడి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని వారు సూచించారు. స్థానికులు, రైతులు, యువత ఈ పక్షులను సంరక్షించడంలో భాగస్వాములు కా వాలని అధికారులు కోరారు. ఈ పక్షులకు ఇక్కడ సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం ద్వారా మరిన్ని అరుదైన జాతులు ఈ ప్రాంతానికి వచ్చే అవకాశముందని వారు చెబుతున్నారు.
అరుదైన అతిథులొచ్చాయ్..!


